కరోనా వైరస్‌కు ధనిక, బీద అనే తేడాలు ఏమీ లేవని ఎవరికైనా... సోకే ప్రమాదముందని హెచ్చరించారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు. కేవలం స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు. మెదక్ జిల్లా కేంద్రంలో నాయీ బ్రాహ్మణులకు, పాస్టర్లకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ.. ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒక్కో కుటుంబానికి రూ.1, 500, ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని ఇస్తున్నారని తెలిపారు. ప్రతిఒక్కరూ.. మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు.
ఇదీ చూడండి: 'దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల్లో మెరుగుదల'