మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక ఛైర్మన్ మురళి యాదవ్‌ను మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. ఆయనకు కరోనా సోకడంతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు నర్సాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్యంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వైద్యుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రితోపాటు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, డీసీసీబీ చిట్టి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.