నాసిరకం విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఏడీఏ బాబూనాయక్ హెచ్చరించారు. మెదక్ లో ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు.
దుకాణాల వద్ద ధరల పట్టిక, నిల్వలకు సంబంధించిన సూచికలు ఏర్పాటు చేయాలని విత్తనాల డీలర్లకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సుల రద్దుకు సిఫారసు చేస్తామని తెలిపారు. రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని స్పష్టం చేశారు. నిల్వలకు సంబంధించిన నివేదికను రోజూ వ్యవసాయ కార్యాలయానికి పంపాలన్నారు.
ఇదీ చూడండి: గ్రేటర్లో పెరుగుతున్న కేసులు.. భయాందోళనలో ప్రజలు