మెదక్ జడ్పీ ఛైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ జిల్లా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ నెల 31 లోగా..
ఎంపీడీవోలతో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో.. జిల్లాలోని శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్లు నర్సరీలతో పాటు.. రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంకుడు గుంతల పురోగతిని ఆమె తెలుసుకున్నారు. ఈ నెల 31 లోగా అన్ని పనులు పూర్తి చేసి రాష్ర్టంలోనే మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.