తనకు కరోనా సోకలేదని... తాను ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. సామాజిక మాధ్యమాల్లో పద్మాదేవేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన పోస్టులపై ఆమె స్పందించారు. ఆ పోస్టును వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన మెదక్ జిల్లా రాజుపల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు. అసత్యప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వారిపై మెదక్ పీఎస్‌లో తెరాస నాయకులు ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి: కరోనాతో చికిత్స పొందుతూ హోంగార్డ్ మృతి