ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం.. జిల్లాలోని మెదక్ మండలం మక్త భూపతిపూర్‌లో గట్టు మైసమ్మ గుడి కమాన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మైసమ్మ తల్లిని దర్శించుకోడానికి చాలా మంది భక్తులు వస్తున్నారని.. గ్రామస్థుల కోరిక మేరకు ఆలయం వరకు రహదారి నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ఏడుపాయల జాతరతో పాటు ఆషాఢ మాస బోనాలు చాలా ప్రాశస్త్యం పొందాయని ఎమ్మెల్యే అన్నారు. రానున్న కాలంలో ప్రాజెక్టుల ద్వారా చెరువులు, కుంటలు నింపి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వందేళ్లుగా అన్నదాతకు దన్ను.. ఖమ్మం డీసీసీబీ