ప్రభుత్వం సూచించిన ఆదేశాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని అలవాటు చేసుకోవాలని... అప్పుడే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తామని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌తో పాటు వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన చేపల మార్కెట్‌ను మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరితో కలిసి అదనపు కలెక్టర్ పరిశీలించారు.
ప్రజలందరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తూ కరోనా వ్యాప్తిని నివారించేందుకు సహకరించాలని కోరారు. ఎవరూ కూడా మాస్క్ లేకుండా బయటకు రాకూడదని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు.
ఇవీ చూడండి: తగ్గుతున్న కేసులు.. పలుచోట్ల కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేత