ETV Bharat / state

'హథ్రాస్ అత్యాచార​ ఘటనలోని నిందితులను వెంటనే ఉరితీయాలి'

ఉత్తరప్రదేశ్​ హథ్రాస్​ అత్యాచార ఘటనలోని దుండగులను వెంటనే ఉరి తీయాలని మెదక్​ జిల్లాలోని పలు గ్రామాల్లో దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. యూపీ ప్రభుత్వం ఇలాంటి ఘనటలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

Medak district Dalit sangh have demanded that the accused in the UP rape case be punished
'హథ్రాస్ అత్యాచార​ ఘటనలోని నిందితులను వెంటనే ఉరితీయాలి'
author img

By

Published : Oct 3, 2020, 6:10 PM IST

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రం, కొల్చారం మండలం సంఘాయిపేట గ్రామాల్లోని అంబేడ్కర్​ విగ్రహాల వద్ద దళిత సంఘాలు నిరసన తెలిపాయి. ఉత్తరప్రదేశ్​ హథ్రాస్​ జిల్లాలో మనీషాపై అత్యాచారం చేసిన దుండగులను వెంటనే ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే పోలీసులు హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వారి ప్రయత్నం మార్చుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట గ్రామ ఉప సర్పంచ్ కోమ్మట బాబు, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి పుర్రె ప్రభాకర్, వివిధ దళిత సంఘల నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: యాదగిరిగుట్టలో ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.