మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యం తేమశాతం వచ్చాకే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం సాయంత్రం చిన్న శంకరంపేట మండలం కొర్విపల్లి వద్ద రోడ్డుపై వడ్లను ఆరబెట్టిన రైతులను చూసి తన వాహనాన్ని ఆపి రైతులతో మాట్లాడారు.
ప్రస్తుతం కొన్నిచోట్ల వరి నూర్పిడి పూర్తి అయిందని... అయితే అకాల వర్షాలు పడటం వడ్లను రోడ్డుపై ఎండబెట్టామని రైతులు కలెక్టర్‌కు వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ హనుమంతరావు... ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పూర్తిగా తేమ శాతం వచ్చిన తర్వాతనే వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డుపక్కన ధాన్యం ఎండబెట్టుకున్న సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందని... దీనిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర ఇస్తున్నందున తేమ శాతం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అన్నారు.
ఇవీ చూడండి: నారా లోకేశ్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం..