ETV Bharat / state

'జూన్​ 10లోగా పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలి' - collector dharma reddy review on cattle health

మెదక్ జిల్లా వ్యాప్తంగా పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ జూన్ 10వరకు పూర్తవ్వాలని తెలిపారు.

medak district collector dharma reddy ordered veterinary doctors to take care of cattle
పశుసంవర్ధక అధికారులతో కలెక్టర్ ధర్మారెడ్డి
author img

By

Published : Jun 3, 2020, 4:40 PM IST

పశువైద్య, పశు సంవర్ధక అధికారులతో మెదక్​ కలెక్టర్ ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్​లో పశువులకు గాలికుంట వ్యాధి సోకకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని సూచించారు. గ్రామాల్లో పాడి రైతులు.. మేకలు, గొర్రెల కోసం తుమ్మ, సుబాబుల్, అవిసె, సూపర్ నేవియర్ గడ్డి వేసేలా వారిని చైతన్య పరచాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశు వైద్యాధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తతపై పశువులు, గొర్రెలు, మేకల పెంపకందారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు.

గొర్రెల కాపరులు, పెంపకందారులు ఒక సొసైటీగా ఏర్పడాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద గొర్రెలకు షెడ్లు నిర్మించడం జరుగుతుందని ఈ విషయాన్ని రైతులు, గొర్రెల పెంపకందారులు, గొర్రెల కాపరులకు తెలియజేయాలని అధికారులకు చెప్పారు. బాధ్యతారహితంగా ప్రవర్తించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • ఇవీ చూడండి: కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.