మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని అదనపు కలెక్టర్ నగేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి వైద్య సేవలు గురించి ఆరా తీశారు. రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలపై వైద్యాధికారులను వివరాలు అడిగారు.
హాస్పటల్లోని కొంతమంది వైద్యులు సరిగా చూడడం లేదని ఫిర్యాదు రావడం మేరకు తనిఖీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మరొకసారి ఆకస్మికంగా వచ్చి పరిశీలిస్తామని పేర్కొన్నారు. కరోనా టెస్టులు సంఖ్య పెంచాలని అధికారులకు సూచించారు.
ఇవీచూడండి: వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే.