మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. క్వారంటైన్లో ఉన్న 23 మంది వలస కూలీలను పరామర్శించారు. మహారాష్ట్ర నుంచి ప్రత్యేక బస్సులో వీరిని తీసుకువచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, దూరం పాటించాలని సూచించారు. తరచుగా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. అందరూ రోగ నిరోధక శక్తిని పెంచుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి: విరోచనాలా? అయితే కరోనా అయి ఉండొచ్చు!