ETV Bharat / state

'గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వికసించాలి'

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. రాబోయే మూడు నెలలు క్లిష్టమైనవని, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

haritha haram
హరితహారం, మెదక్
author img

By

Published : Jun 18, 2021, 9:59 AM IST

గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వికసించేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. కలెక్టరేట్​లో మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీపీలతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆర్అండ్​బీ, పంచాయతీ రోడ్లు, మండల, గ్రామ రహదారుల వెంట మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. మూడు జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటేందుకు అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా డీఎఫ్​వోకు సూచించారు. జిల్లాలో హరితహారంలో భాగంగా 35 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.

పరిశుభ్రతే లక్ష్యం

పూలు, పండ్లు, ఇతర మొక్కల కోసం ట్రీ గార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మండలంలో ప్రముఖులు మొక్కలు నాటే విధంగా కనీసం ఐదు ప్రాంతాలను గుర్తించాలన్నారు. రాబోయే మూడు నెలలు చాలా క్లిష్టమైనవని… పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో రోడ్లు శుభ్రంగా ఉంచాలని, మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, ముళ్ల పొదలను తొలగించాలని, దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కలిగించాలని కోరారు. తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలని, వర్మి కంపోస్ట్ తయారు చేసి మొక్కలకు ఉపయోగించాలని సూచించారు.

నిధులు ఖర్చు చేయాలి

ఉపయోగంలేని బోరు బావులను, వ్యవసాయ, ఊర బావులను మూసివేయాలన్నారు. ప్రతి బుధవారం అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు , పీహెచ్​సీలను శుభ్రం చేయాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి నిధులు, పనులపై సమీక్షించాలని పేర్కొన్నారు. వైకుంఠధామాల పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పచ్చదనం కోసం కేటాయిస్తున్న 10 శాతం నిధులను ఖర్చు చేయాలని సూచించారు. మండలంలో ఉత్తమంగా ఉన్న ఐదు నర్సరీల జాబితా అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో శైలేష్, డీపీవో తరుణ్ కుమార్, డీఎఫ్​వో జ్ఞానేశ్వర్, తూప్రాన్ ఆర్​డీవో శ్యాం ప్రకాష్, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో దేశానికి దిక్సూచిగా రాష్ట్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.