రాగల మూడు రోజులు వర్షాలు పడే సూచనలు ఉన్నందున వర్షానికి ధాన్యం కొట్టుకుపోకుండా, పాడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మెదక్ కలెక్టర్ హరీష్.. అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందించడంతోపాటు, అవసరమైతే సమీప రైతు వేదికల్లో ధాన్యాన్ని భద్రపరచవలసిందిగా ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనుమతి ఇచ్చారని తెలిపారు.
ఇదీ చదవండి: తౌక్టే ఎఫెక్ట్.. రాష్ట్రంలో జోరుగా వర్షాలు