ETV Bharat / state

ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు - విస్తరాకుల తయారీ విధానం

మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విస్తరాకుల తయారీ కేంద్రాన్ని మెదక్ కలెక్టర్​ హరీశ్ ఘనంగా ప్రారంభించారు. విస్తరాకుల తయారీతో ఆర్థిక భరోసా పొందుతోన్న మహిళలు.. ఎంతో మందికి ఆదర్శమన్నారు. మహిళలంతా ఒకరికొకరు సహాయసహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని కోరారు.

manufacturing of expanders
manufacturing of expanders
author img

By

Published : Jun 17, 2021, 9:21 PM IST

మెదక్ జిల్లా రామాయంపేట్ మండలం ఝాన్సీ లింగాపూర్​లో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విస్తరాకుల తయారీ కేంద్రాన్ని కలెక్టర్​ హరీశ్ ఘనంగా ప్రారంభించారు. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోన్న మహిళలను ప్రత్యేకంగా అభినందించారు.

ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే విస్తరాకుల్లో ప్లాస్టిక్‌ కలిసి ఉంటుందని, దాని ద్వారా అటు ప్రజలకు, ఇటు ప్రకృతికి హాని కలిగే అవకాశం ఉందని మహిళలు వివరించారు. మోదుగ ఆకులతో తయారైన విస్తరాకుల ద్వారా ఎటువంటి నష్టం ఉండదన్నారు. మేరీ మహిళా స్వయం సహాయక సంఘం తరఫున రూ. 1 లక్షా 30 వేలను లోన్​గా తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్, తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Etela: హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​కు ఘనస్వాగతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.