ఇప్పటివరకు ఒక లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఒక్కసారిగా కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా ధాన్యం రావడం వల్ల అన్లైన్లో చేయడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారంలో మహేశ్వరి బిన్నీ పార్బాయిల్డ్ రైస్‌మిల్‌ను జాయింట్ కలెక్టర్ రమేశ్‌తో పాటు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నాలుగు రోజుల నుంచి ఆకస్మికంగా మిల్లులను తనిఖీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. హమాలీలను ఎక్కువగా పెట్టుకోవాలని.. వేగంగా ధాన్యాన్ని తరలించాలని నిర్వాహకులను అదేశించామన్నారు.
కరోనా, హమాలీల కొరత వల్ల కాస్త ఇబ్బంది ఏర్పడిందని.. పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని, రంజాన్ పండుగ సెలవులు ఏమి లేవని జాయింట్ కలెక్టర్ రమేశ్ అన్నారు.
ఇదీ చూడండి: 'కరోనాకు జీవించే స్వేచ్ఛ ఉంది కదా?'