మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో చెరువుల పరిరక్షణపై రెవిన్యూ, నీటి పారుదల శాఖ అధికారులతో కలెక్టర్ ఎస్. హరీశ్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలోని ప్రాధాన్యత గల చెరువులకు సరిహద్దులు గుర్తించి... అవసరమైన సర్వే చేసి, ప్రాథమిక దశలో నోటిఫికేషన్ ఇచ్చి అట్టి వివరాలను హెచ్ఎండీఏ వెబ్ సైట్లో పొందుపరచాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో 589 చెరువులకు గాను 526 చెరువుల సర్వే పనులు పూర్తి చేసి 156 చెరువులకు సంబంధించి ప్రాథమికంగా నోటిఫైడ్ చేశామని కలెక్టర్ హరీష్ అన్నారు. మిగతా 63 చెరువుల సర్వేతో పాటు 370 చెరువుల ప్రిలిమినరీ నోటిఫికేషన్‌కు తగు చర్యలు తీసుకోవలసిందిగా అధికారులకు సూచించారు. తహసీల్దార్లు ప్రాథమిక దశలో నోటిఫై చేసి.. ఆ వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలని తెలిపారు. అభ్యంతరాలు రాకపోతే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు.
శిఖం భూములు కబ్జా కాకుండా చూడాలని, అన్యాక్రాంతమైతే నోటిసు ఇచ్చి ఆర్డర్ పాస్ చేయండని, అవసరమైతే వాల్టా చట్టం క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, కట్టడాలను తొలగించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కల్లెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్లు, డీఎస్పీ కృష్ణమూర్తి, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాసరావు, డీపీఓ తరుణ్ కుమార్, డీఎఫ్ జ్ఞానేశ్వర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు గంగయ్య, మిషన్ భగీరథ అధికారి కమలాకర్, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య