ETV Bharat / state

నాణ్యత లోపాలు ఉంటే చర్యలు తప్పవు: కలెక్టర్​ హనుమంతరావు

రైతువేదికల నిర్మాణాల్లో ఏమాత్రం నాణ్యత లోపాలు ఉన్నా చర్యలు తప్పవని మెదక్​ జిల్లా కలెక్టర్​ యం.హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం కొల్చారం మండలంలోని రంగంపేటలో రైతువేదిక నిర్మాణ పనులను​ పరిశీలించారు.

medak collector visited rythuvedika in rangampeta
నాణ్యత లోపాలు ఉంటే చర్యలు తప్పవు: కలెక్టర్​ హనుమంతరావు
author img

By

Published : Oct 28, 2020, 10:33 PM IST

మెదక్​ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేటలో రైతువేదిక నిర్మాణ పనులను​ కలెక్టర్​​ యం.హనుమంతరావు పరిశీలించారు. నిర్మాణాల్లో ఏమాత్రం నాణ్యత లోపాలు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. రైతు వేదిక నిర్మాణ పనుల విషయమై సంబంధిత కాంట్రాక్టర్​ను అడిగి వివరాలను తెలుసుకొన్నారు.

అధికారులు నిత్యం గ్రామాల్లో పనులను పర్యవేక్షిస్తున్నప్పటికీ... ఆశించినంత మేర జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: దంత వైద్యుడి అపహరణ కేసులో ఏడుగురు అరెస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.