తాగునీరు, పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని వీధుల్లో పర్యటించి సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీటి పనులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. నీరు సరఫరా చేసే పైప్లైన్ పనులు పూర్తి చేయాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండిః దిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!...ఆమె 6 నెలల గర్భవతి