ETV Bharat / state

మంజీరా తీరాన అశోకుడి ఆనవాళ్లు - మెదక్​ జిల్లా వార్తలు

మెదక్​ జిల్లా మంజీరా తీరాన మౌర్యుల కాలం నాటి ఆధారాలు లభ్యమయ్యాయి. మృణ్మయ పాత్రపై బ్రహ్మి లిపిలో ప్రాకృత భాషలో ‘దేవానాం’ అనే లేఖనం దొరికింది. ఇది క్రీస్తుపూర్వం మూడో శతాబ్దానికి చెందినది.

ashoka
ashoka
author img

By

Published : Nov 25, 2020, 9:16 AM IST

మెదక్‌ జిల్లా మంజీరా తీరాన మౌర్యుల కాలానికి సంబంధించిన ఆధారాలు వెలుగుచూశాయి. ఇప్పటివరకు చాలాచోట్ల అశోకుడి కాలానికి సంబంధించిన శిలాశాసనాలు గుర్తించారు. భారత్‌తోపాటు అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, నేపాల్‌లలో ఇవి లభ్యమయ్యాయి. తాజాగా మంజీరా తీరాన మృణ్మయ పాత్రపై బ్రహ్మి లిపిలో ప్రాకృత భాషలో ‘దేవానాం’ అనే లేఖనం దొరికింది. తెలంగాణలోనే తొలిసారిగా మెదక్‌ జిల్లా కొల్చారంలో ఇవి దొరకడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది క్రీస్తుపూర్వం మూడో శతాబ్దానికి చెందినది.

అశోకుడి బిరుదు

‘దేవానాం ప్రియం’ అనేది అశోకుడి బిరుదు. దేవతలకు ఇష్టమైనవాడు అని అర్థం. దీనిద్వారా తెలంగాణలో మౌర్యుల కాలం నాటి ఆవాసాలున్నట్లు తేలిందని చరిత్ర, పురాతత్త్వ పరిశోధకులు ఎం.ఏ.శ్రీనివాసన్‌ తెలిపారు. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలోని శాసనశాస్త్ర విభాగం తమ అన్వేషణలో కనిపెట్టిన అంశాలను ధ్రువీకరించిందని వివరించారు. ఇక్కడ దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో ఆధారాలు దొరికే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

చారిత్రక సంపద దొరికే అవకాశం

శ్రీనివాసన్‌ బృందం కొల్చారం గ్రామానికి 2కిలోమీటర్ల సమీపంలో ఉన్న ప్రాంతంలో మూడు నెలలపాటు అన్వేషణ సాగించింది. ‘దేవానాం’ లేఖనం దొరికిన ప్రాంతానికి కిలోమీటరు దూరంలోని రాతి గుహల్లో తొలుత మూడు బౌద్ధ లఘుశాసనాలు లభించాయి. వీటిని ఆధారం చేసుకొని అన్వేషించగా ఈ లేఖనం దొరికిందని శ్రీనివాసన్‌ తెలిపారు. ఇక్కడ తవ్వకాలు చేపడితే గొప్ప చారిత్రక సంపద దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్​ హత్య కేసులో భార్య హస్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.