ETV Bharat / state

వన దుర్గమాత.. వందనలమ్మా.. చల్లగా కరుణించవమ్మా - తెలంగాణలోని సాంస్కృతిక ఉత్సవాలు

Mahashivratri celabrations in edupayala: మెదక్​ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన వనదుర్గామాత ఏడుపాయలలో మహాశివరాత్రి జాతర శనివారం వైభవంగా ప్రారంభం అయ్యింది. రాష్ట్ర పండుగ కావడంతో ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖా మంత్రి హరీశ్​రావు, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డితో కలిసి వనదుర్గ భవాని మాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు, ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు.

వన దుర్గమాత
వన దుర్గమాత
author img

By

Published : Feb 18, 2023, 4:38 PM IST

Updated : Feb 18, 2023, 4:54 PM IST

Mahashivratri celabrations in edupayala: ఏడుపాయలలో మహాశివరాత్రి సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పువ్వులతో అందంగా అలంకరణ చేశారు. వనదుర్గా భవాని మాత విశేష అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఏడుపాయల ప్రాంగణం సందడిగా మారింది. తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకం, అలంకరణ చేసి అర్చన నిర్వహించి జాతర వేడుకలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. ఓవైపు శివనామస్మరణతో మరోవైపు దుర్గమ్మ నామస్మరణతో ఏడుపాయల ఆలయం మార్మోగింది.

ఏడుపాయల వనదుర్గా భవాని మాత ప్రత్యేక అలంకరణతో ఆకట్టుకుంది. పూజారులు అమ్మవారిని పట్టుచీర, బంగారు నగలు, ముక్కుపుడకతో అలంకరించారు. గజమాలలు, పూలదండల అలంకరణతో అమ్మవారి రూపం ఎంతో దేదీప్యమానంగా, ఆకర్షణీయంగా భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ మండపాన్ని, ప్రాంగణాన్ని, ధ్వజస్తంభాన్ని రంగు రంగుల పూలతో అలంకరించారు. రాజగోపురం నుంచి ఆలయానికి వెళ్లే దారిలో ఆకట్టుకునేలా అరటి కొమ్మలు కమాన్​లు ఏర్పాటు చేశారు.

ఏడుపాయలలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభించిన మంత్రి హరీశ్​రావు

Harishrao started Mahashivratri celebrations in Edupayala: మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి, మదన్ రెడ్డి కలిసి కలిసి గర్భగుడి ముందు మంజీరా నదీ పాయ మధ్యలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివుని వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మెదక్ జిల్లాలో ఏడుపాయల అమ్మవారి ఉత్సవాలను అత్యంత ఘనంగా ఈ శివరాత్రి పర్వదినాన అధికారిక లాంఛనాలతో ప్రారంభించడం జరిగిందన్నారు.

శివుడి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఆగ్ర భాగాన ఉండే విధంగా ఆ పరమశివుడు ఆశీస్సులు అందజేయాలని ప్రార్థించడం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా ఆలయాన్ని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దామని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 18, 2023, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.