మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి సమీపంలో గల మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఉమ్మడి మెదక్ జిల్లా గురుకుల పాఠశాలల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి ప్రదర్శనలు చాలా ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి: మిషన్ భగీరథ స్ఫూర్తితో... హరిత ఉద్యమం..