మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని తోనిగాండ్ల గ్రామ శివారులో పొలం వద్ద కట్టేసిన ఆవుపై గత రాత్రి చిరుతపులి దాడి చేసింది. ఈ ఘటనలో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఇటీవల కాలంలో రామాయంపేట మండలంలో చిరుత పులుల సంచారం బాగా ఎక్కువైందని ప్రజలు చెబుతున్నారు.
ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 50కి పైగా పశువులు చిరుత దాడిలో మృత్యువాత పడ్డాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు వెళ్లాలంటేనే భయమేస్తోందని చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని చిరుతపులి నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని గ్రామస్థులు కోరారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్