ETV Bharat / state

సభా వేదికపై తండ్రికి కేటీఆర్ సవాల్

ఎన్నికల్లో అధికార విపక్షాల మధ్య పోటీ ఉంటుంది. కానీ..కేటీఆర్ మాత్రం కాంగ్రెస్, భాజపాతో అసలు పోటీ లేదంటున్నారు. తమ పార్టీలో ఉన్నవారితోనే పోటీ ఉందని హరీష్​రావును చూపిస్తూ బాంబు పేల్చారు. అంతేనా..ఏకంగా కేసీఆర్​కే సవాల్ విసిరారు. ఇంతకీ కేటీఆర్​ ఎందుకు కన్నెర్ర చేశారు..?

తండ్రికి సవాల్
author img

By

Published : Mar 8, 2019, 6:06 PM IST

Updated : Mar 8, 2019, 6:57 PM IST

మెదక్​లో నిర్వహించిన పార్లమెంట్ సన్నాహక సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హరీష్​ వేదికపై ఉండగా కేటీఆర్ ఓ సవాల్ విసిరారు. తమకు కాంగ్రెస్, భాజపాలతో పోటీ లేదని..తమ పార్టీలోని నేతలతోనేనని బావ వంక చూస్తూ బామ్మార్ది బాంబు పేల్చారు. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే మరో ట్విస్ట్ ఇచ్చారు కేటీఆర్. వాళ్లూ వీళ్లూ కాదు ఏకంగా కేసీఆర్​కే సవాల్ విసిరారు.

తండ్రికి సవాల్

కేసీఆర్​కి కేటీఆర్ సవాల్

కేసీఆర్​కి కేటీఆర్ సవాల్ చేయమేంటని షాక్ అవుతున్నారా..! బావను చూస్తూ బామ్మార్ది పేల్చిన బాంబేంటని ఆలోచిస్తున్నారా..!. అసలు విషయానికొస్తే..పార్లమెంట్ సన్నాహక సభల్లో భాగంగా మెదక్ జిల్లాలో సమావేశం ఏర్పాటు చేశారు. వేదికపై హరీష్​రావుతోపాటు మెదక్ జిల్లా నేతలంతా ఉన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​, భాజపాలతో పోటీ కాదని, మెజార్టీ విషయంలో తమ పార్టీలో నేతలే ఒకరికొకరు పోటీ పడాలని పిలుపునిచ్చారు. వేదికపై ఉన్న హరీష్​రావును చూస్తూ ఛాలెంజ్ చేశారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాకూ.. తాను గెలిచిన కరీంనగర్ జిల్లాకే పోటీ అన్నారు. తమ కన్నా ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవాలని తన తండ్రి కేసీఆర్​కే సవాల్ చేశారు.

గులాబీ నేతల నవ్వులు

కేటీఆర్​ విసిరిన సవాల్​తో వేదికపైన ఉన్న నేతలంతా నవ్వుల్లో మునిగిపోయారు. హరీష్​ రావు చప్పట్లతో స్వాగతించగా..మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్​రెడ్డి విజయకేతనం చూపిస్తూ అందరిని ఆకట్టుకున్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Mar 8, 2019, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.