ETV Bharat / state

ధాన్యం తూకం సరిగ్గా చేయడం లేదంటూ అన్నదాతల ఆందోళన - ధాన్యం తూకం సరిగ్గా చేయడం లేదంటూ అన్నదాతల ఆందోళన

ధాన్యం తూకంలో అవకతవకలు చేస్తున్నారంటూ మెదక్ జిల్లా కాట్రియాల రైతులు ఆందోళనకు దిగారు. దాదాపు 6 నుంచి 7 కిలోల ధాన్యం నష్టపోయేలా తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

katriala farmers protest
ధాన్యం తూకం సరిగ్గా చేయడం లేదంటూ అన్నదాతల ఆందోళన
author img

By

Published : May 24, 2021, 2:44 PM IST

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ధాన్యం తూకంలో అవకతవకలు చేస్తున్నారని 100 మంది రైతులు ఆందోళన చేశారు. ఒక్కో సంచికి 41 కిలోలు తూకం వేయాల్సి ఉండగా... 47 కిలోల తూకం వేస్తున్నారని అన్నదాతలు వాపోయారు. ఒక సంచికి 6 నుంచి 7 కిలోలు ఎక్కువ తూకం వేస్తున్నారని కొనుగోలు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ కాంటా ఉపయోగించకుండా మామూలు త్రాసుతో ధాన్యాన్ని తూకం వేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు తెలిపారు.

ఎండ పోసి జల్లెడ పట్టిన వడ్లను ఈ విధంగా తూకం వేయడం సరికాదన్నారు. నెలల తరబడి ధాన్యాన్ని తూకం వేయకపోవడం వల్ల టార్ఫాలిన్ కవర్లకు కిరాయిలు కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి డిజిటల్ కాంటాతో ధాన్యాన్ని తూకం వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి : రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.