ETV Bharat / state

కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారుల ఎదురుచూపులు

వెన్నవరం సత్తిరెడ్డి, అంజమ్మ దంపతుల స్వస్థలం మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం ఆరెగూడెం. 2019 ఏప్రిల్‌ 26న వారి కుమార్తె వకుళ వివాహం మహేశ్‌రెడ్డితో జరిగింది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టులో కల్యాణ లక్ష్మి పథకం కింద సాయానికి దరఖాస్తు చేశారు. ఇంతవరకు మంజూరు కాలేదు. దరఖాస్తు చేసి సుమారు 11 నెలలు అవుతుండటం వల్ల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ పరిస్థితి వారికి ఒక్కరికే కాదు. మెదక్‌ జిల్లాలో 2,740 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ సాయం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. త్వరగా మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.

కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారుల ఎదురుచూపులు
కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారుల ఎదురుచూపులు
author img

By

Published : Jul 22, 2020, 4:08 PM IST

మెదక్‌ జిల్లాలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా సాయం కోసం వేలాది పేద కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఏడాదిగా దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ రాకపోవడం వల్ల లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. వివిధ దశల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండు పథకాలకు సంబంధించి గతేడాది, ఈ ఏడాది 3,535 దరఖాస్తులకు మోక్షం కలిగాల్సి ఉంది.

బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని పేదింటి ఆడపడచుల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తోంది. వివాహం అయిన వారు దరఖాస్తు చేశాక తహసీల్దారు పరిశీలించి ఎమ్మెల్యేలకు సిఫార్సు చేస్తారు. ఎమ్మెల్యేలు వాటికి ఆమోదముద్ర వేశాక అవి ఆర్డీవో కార్యాలయాలకు చేరతాయి. అక్కడ వాటికి ఆమోదముద్ర వేసి ఖజానా శాఖకు పంపాల్సి ఉంటుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే లబ్ధిదారులకు చెక్కులు అందుతాయి. ఈ ప్రక్రియ అంతా అంతర్జాలం ద్వారా చేపట్టాల్సి ఉంది.

రూ.17.12 కోట్లు అవసరం..

జిల్లాలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం ద్వారా 1,711 మంది లబ్ధిదారులకు చెక్కులు అందాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాకు రూ.17.12 కోట్ల వరకు బడ్జెట్‌ అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 3,551 దరఖాస్తులు రాగా, అందులో మెదక్‌ డివిజన్‌లో 1,745, నర్సాపూర్‌ డివిజన్‌లో 911, తూప్రాన్‌ డివిజన్‌లో 895 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,029 దరఖాస్తులకు ఎమ్మెల్యేలు ఆమోదముద్ర వేయగా మంజూరు ప్రక్రియ వద్ద నిలిచిపోయాయి.

ఎమ్మెల్యేలు ఆమోదించిన తర్వాత ప్రభుత్వ మంజూరుకు ఎదురుచూస్తున్న వాటిలో అత్యధికంగా 642 తూప్రాన్‌ డివిజన్‌లో ఉండగా, మెదక్‌లో 254, నర్సాపూర్‌లో 133 దరఖాస్తులు ఉన్నాయి. వాటి వివరాలను ఆర్డీవోలు ఖజానా శాఖకు పంపాల్సి ఉంది. ఆర్డీవోలు చొరవ తీసుకొని ఎమ్మెల్యేలు ఆమోదముద్ర వేసిన దరఖాస్తులను ఖజానా శాఖకు పంపితే లబ్ధిదారులకు కాస్త ఊరట లభిస్తుంది. ఇక ఆర్డీవో కార్యాలయం నుంచి ట్రెజరీకి పంపినవి 1,711 దరఖాస్తులు ఉండగా అందులో అధికశాతం బీసీ వర్గాలకు చెందినవే. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బడ్జెట్‌ కేటాయించిన ప్రభుత్వం బీసీ వర్గాలకు ఇవ్వడం లేదు. ఈ కారణంతోనే దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు.

ఇక తహసీల్దార్ల వద్ద 390, ఎమ్మెల్యేల వద్ద 405 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి మోక్షం కలిగేలా కృషి చేయాలని దరఖాస్తుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా అదనపు పాలనాధికారి నగేశ్‌ను వివరణ కోరగా పెండింగ్‌ దరఖాస్తులు సత్వరమే పరిష్కారం అయ్యేలా చూస్తామని, బడ్జెట్‌ కేటాయింపు లేక సాయం అందడం లేదన్నారు.

ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.