మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో 15 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. దాతల సహకారంతో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అందించారు. అనంతరం బాచురాజుపల్లి, రజాక్ పల్లి గ్రామాల్లో నిరుపేదలకు కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. ప్రజలందరూ మే 7 వరకు ఇళ్ల నుంచి బయటకు రాకుండా తప్పనిసరిగా లాక్ డౌన్ పాటించాలని సూచించారు.
కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు. దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి పేద ప్రజలకు నిత్యావసర సరకులను పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయ్ కుమార్, ఎంపీపీ సిద్ధా రాములు , రజాక్ పల్లి సర్పంచ్ ధర్మ సునీత, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఆస్పత్రిలోకి నో ఎంట్రీ- 6 గంటలు రోడ్డుపైనే కరోనా రోగులు