మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. అధికారులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ప్రజలు మాత్రం తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
పట్టణంలోని ఆధార్ కేంద్రంలో తప్పుల సవరణ, కొత్త కార్డుల కోసం వచ్చేవారు గుంపులు గుంపులుగా ఉంటున్నారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్క్ ధరించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సాయంత్రం వరకు నిర్వహించాల్సిన ఆధార్ కేంద్రాన్ని నిర్వాహకుడు మధ్యాహ్నం తర్వాత మూసివేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రజలు ఎవరికి వారు తగు జాగ్రత్తలు పాటించాలని పలువురు కోరుతున్నారు. ఇలాగే కొనసాగితే పట్టణంలో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచూడండి.. రాష్ట్రంలో కొత్తగా 2,795 కరోనా కేసులు, 8 మరణాలు