ETV Bharat / state

నర్సాపూర్​లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

author img

By

Published : Mar 25, 2021, 8:12 PM IST

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ సునీతారెడ్డి అన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

state women commission chairmen, medak, narsapur
women's day, Sunitha reddy

రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలను వేధిస్తున్నారని సమాచారమిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్​ ఛైర్మన్​ సునీతా రెడ్డి అన్నారు. నర్సాపూర్​లో ఐసీడీఎస్​ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి అధ్యక్షత ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు పనిచేసే చోట ప్రత్యేకంగా కమిటీలు వేయించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తల సేవలను కొనియాడారు.

నర్సాపూర్​లో మహిళాదినోత్సవ వేడుకలు
నర్సాపూర్​లో మహిళాదినోత్సవ వేడుకలు

కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విశిష్ట సేవలు అందించిన పలువురు ఐసీడీఎస్​ సిబ్బందికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సంస్థ సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఆశాలత, మహిళ కమిషన్ కార్యదర్శి రసూల్ బి, మహిళా శిశు సంక్షేమ జిల్లా అధికారి పద్మ, జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్​లో మహిళాదినోత్సవ వేడుకలు
నర్సాపూర్​లో మహిళాదినోత్సవ వేడుకలు

ఇదీ చూడండి: ఆర్‌ అండ్‌ బీ శాఖలో రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం: ప్రశాంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.