IIT Hyderabad Alumni Day: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ తన 3వ పూర్వ విద్యార్థుల దినోత్సవం క్యాంపస్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం పలువురు పూర్వ విద్యార్థులను ప్రత్యేక అలుమ్ని ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు. ప్రస్తుత, భవిష్యత్ విద్యార్థులకు విద్యాబోధనలో పూర్వ విద్యార్థుల సహకారం మరువలేనిదని స్వాగత ఉపన్యాసం చేసిన డీన్ డాక్టర్ ముద్రికా ఖండేల్వాల్ అన్నారు.
సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ విద్యాబోధనలో మార్పులు చేసుకున్నప్పుడే ఐఐటీల మనుగడ సాధ్యమని ఈసీఐఎల్ డైరెక్టర్ డాక్టర్ అనేశ్ కుమార్ శర్మ అన్నారు. ఐఐటీ హైదరాబాద్ లాంటి గొప్ప అకాడమీ సక్సెస్ కోసం కృషి చేస్తున్న అందరికి అభినందనలు తెలిపారు. అకాడమీ ప్రారంభమైన పదేళ్లలోనే దేశంలోని టాప్ 10 ఇనిస్టిట్యూట్లలో ఒకటిగా ర్యాంక్ సాధించిందని.. రాబోయే రోజుల్లో ఈ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని అకడమిక్ డీన్ ప్రొఫెసర్ సప్తర్షి మజుందార్ సూచించారు. నెంబర్ వన్ స్థానం సాధించే వరకు ఆగవద్దని.. అందులో పూర్వ విద్యార్థులు కూడా కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో అకడమిక్స్, రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్, నేషనల్ బిల్డింగ్, ఇన్‌స్టిట్యూట్ బిల్డింగ్, యాన్యువల్ రిలేషన్స్ రంగాల్లో అత్యుత్తమ పనితీరుకు ఏడు అవార్డులు ఇవ్వబడ్డాయి. 2008లో సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలో ప్రారంభమైన ఐఐటీ హైదరాబాద్‌లో.. 4500మంది పూర్వ విద్యార్థులతో 5200 మంది వరకు ఉన్నారు. 2008లో ప్రారంభమైన ఈ క్యాంపస్.. 18 విభాగాల్లో విద్యార్థులను శాస్త్ర సాంకేతిక రంగాల్లో మేధావులుగా తీర్చిదిద్దుతోంది.
ఇవీ చదవండి:
రైతన్నలకు శుభవార్త.. యాసంగి రైతుబంధు విడుదల తేదీ ఇదే..
త్వరలో మూడు కరోనా వేవ్‌లు.. 10 లక్షల మరణాలు.. చైనాలో ఇక విధ్వంసమే!
ఫిఫా వరల్డ్ కప్‌లో మెరవనున్న దీపికా పదుకొణె ఏం చేయబోతోందో తెలుసా