EDUPAYALA TEMPLE: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో రెండవ రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు బుధవారం రోజు కావడంతో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.
![Crowds of devotees in the queuelines for the visit of the Goddess](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14616613_-devotees-crowd.png)
భక్తులు మంజీరా నది పాయలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. డప్పుల దరువు , జయజయ ధ్వానాల మధ్య బండ్ల ఊరేగింపు కన్నుల పండగగా సాగనుంది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ఏడుపాయలకు బయలు దేరింది.
![edupayala vana durga](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14616613_362_14616613_1646222662218.png)
గురువారం రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: Harish rao at Edupayala: వందకోట్లతో ఏడుపాయల అభివృద్ధి: హరీశ్ రావు