ETV Bharat / state

Harish Rao Telangana Elections 2023 : 'ఉమ్మడి మెదక్ జిల్లాలో 10స్థానాలు గెలిచి.. కేసీఆర్​కు కానుక ఇస్తా'

Harish Rao Telangana Elections 2023 : కేసీఆర్‌ వ్యూహానికి విపక్షాలు అతలాకుతలం అవుతున్నాయని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో గోబెల్స్ ప్రచారంతో ప్రతిపక్షాలు గెలవాలని ఆరాట పడుతున్నాయని విమర్శించారు. ఉమ్మడి మెదక్‌లో పదికి.. పదిస్థానాల్లో గెలిచి కేసీఆర్‌కు కానుక ఇస్తామని హరీశ్‌రావు పునురుద్ఘాటించారు.

cm kcr medak district tour on wednesday
Harish Rao criticism of BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2023, 6:39 PM IST

Harish Rao Fires on Congress కేసీఆర్‌ వ్యూహానికి విపక్షాలు కకలావికలం

Harish Rao Telangana Elections 2023 : ఎవ్వరూ ఊహించని విధంగా ఒకే సారి భారీగా అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహానికి.. విపక్షాలు కకావికలం అవుతున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి అసలు కేడర్ లేదని.. కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో దరఖాస్తుల పేరుతో హస్తం పార్టీ టికెట్లు అమ్ముకుంటోందని(Minister Harish Rao) ఆరోపించారు. ఉమ్మడి మెదక్‌జిల్లాలో పదికి.. 10 స్థానాల్లో గెలిచి.. కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని హరీశ్‌రావు వివరించారు.

CM KCR Medak Tour : అంతకుముందు హరీశ్‌రావు మెదక్‌లో కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. బుధవారం రోజున మెదక్ జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్.. మధ్యాహ్నం 1:00 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం 1:20 గంటలకు ఎస్పీ కార్యాలయాన్ని.. 1:40 గంటలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలోనే వికలాంగులు ఆసరా పెన్షన్ పెంపు రూ. 4,016 కార్యక్రమాన్ని మెదక్ వేదికగా.. కేసీఆర్ ప్రారంభించనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.

CM KCR Meeting in Medak : అనంతరం మధ్యాహ్నం 3:30 మెదక్ చర్చి మైదానంలో.. లక్ష మందితో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారని హరీశ్‌రావు తెలిపారు. మరోవైపు బుధవారం రోజున జరిగే బీఆర్ఎస్ సభ(CM KCR Meeting Medak)కు చాలా ప్రాధాన్యత ఉందని.. ముఖ్యమంత్రి ప్రగతి శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరిస్తారని వెల్లడించారు. బీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తుందని వివరించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కులవృత్తులకు రూ. లక్ష ఇచ్చే పథకాలను.. కేంద్రం కాపీ కొడుతోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే గోబెల్స్ ప్రచారంతో ప్రతిపక్షాలు గెలవాలని చూస్తున్నాయని.. అది వారి అవివేకమని హరీశ్‌రావు విమర్శించారు.

BRS Wins 10 Seats in Medak : మెదక్ జిల్లాలో రూ.100 కోట్లతో ఘనపురం ఆయకట్టును అభివృద్ధి చేశామని హరీశ్‌రావు పేర్కొన్నారు. అందుకే కేసీఆర్ అంటే.. కే.. అంటే కాలువలు.. సీ అంటే చెరువులు.. ఆర్ అంటే రిజర్వాయర్లుగా మారిందని చెప్పారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కూడా భారత రైతు సమితి అయిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు తెలంగాణ పథకాలను కావాలని కోరుతున్నారని హరీశ్‌రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

"ఎవ్వరూ ఊహించని విధంగా ఒకే సారి భారీగా అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తాం. బీజేపీకి క్యాడర్ లేదు.. కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కులవృత్తులకు రూ. లక్ష ఇచ్చే పథకాలను.. కేంద్రం కాపీ కొడుతోంది. అందుకే కేసీఆర్ అంటే.. కే.. అంటే కాలువలు.. సీ అంటే చెరువులు.. ఆర్ అంటే రిజర్వాయర్లు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి." - హరీశ్‌రావు, మంత్రి

Minister Harish Rao Speech at Council : 'ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలనలో.. హైదరాబాద్​​ హెల్త్ ​హబ్​గా మారింది'

Harish Rao on BJP and Congress : 'బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రానికి శాపంగా మారాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.