ETV Bharat / state

నాడు అన్నం పెట్టిన గడ్డే... నేడు పొట్ట కొట్టింది - KOOLEELU

ఆకలితో ఉన్న వారికి ఎండుగడ్డి ఆసరాగా నిలిచింది. అంతంత మాత్రంగా సాగే బతుకుల్లో వెలుగులు నింపింది. చివరకు... అక్కడి యువతకు అదో వ్యాపారంగా మారింది. ఇంతలోనే కర్షకుడికి కన్ను కుట్టింది. మూడేళ్లుగా ముఖం చాటేయడంతో అప్పాజిపల్లి గ్రామస్థుల జీవితం చీకటిమయమైంది. ఒకప్పుడు అన్నం పెట్టిన గడ్డే... ఇప్పుడు వారి మోముల్లో దుఃఖానికి కారణమైంది.

నాడు అన్నం పెట్టిన గడ్డే... ఇప్పుడు ఆగం చేసింది
author img

By

Published : Apr 23, 2019, 9:13 PM IST

Updated : Apr 23, 2019, 10:11 PM IST

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండు గడ్డి పేరెత్తగానే గుర్తొచ్చేది అప్పాజి పల్లి గ్రామం. కొల్చారం మండల పరిధిలో గల ఈ గ్రామంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా గడ్డి వ్యాపారం చేస్తున్నారు. అక్కడి గ్రామస్థుల్లో అధిక శాతం కుటుంబాలకు ఎండు గడ్డి వ్యాపారమే జీవనోపాధి. 290 కుటుంబాలు, 14 వందల మంది జనాభా ఉన్న ఆ ఊర్లో 55కు పైగా లారీలుంటాయి. వీరంతా పేద మధ్యతరగతికి చెందినవారవడం బాధాకరం.

40 ఏళ్లుగా ఎండుగడ్డి వ్యాపారమే...

1977-78 ప్రాంతంలో ఇక్కడ వరిగడ్డి వ్యాపారం మొదలైంది. వ్యవసాయ రంగ ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంలో అధికంగా వరి సాగు చేసేవారు. అందువల్ల ఎండుగడ్డి ఇక్కడ ఎక్కువగా దొరికేది. హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి ఇక్కడకొచ్చి ఎండుగడ్డిని తీసుకెళ్లేవారు. ఇలా అప్పాజిపల్లిలో ఎండుగడ్డి వ్యాపారం మొదలైంది. 10 సంవత్సరాలపాటు గడ్డిని విక్రయించిన రైతులు... క్రమంగా వారే గడ్డిని తరలించడం మొదలుపెట్టారు. లారీ నడపడం నేర్చుకొని వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి కూడా గడ్డి సేకరణ

అప్పాజిపల్లితోపాటు పరిసర గ్రామాల వారందరికీ గడ్డి వ్యాపారం ఉపాధి కల్పిస్తోంది. ప్రతి పంట సీజన్​లో రోజుకు సుమారు 30 నుంచి 35 లారీలు ఇక్కడి నుంచి హైదరాబాద్​కు గడ్డిని తరలిస్తుంటాయి. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి గడ్డిని కొనుగోలు చేసి మహానగరానికి చేర్చి దిల్​షుక్​నగర్ పండ్ల వ్యాపారులకు విక్రయిస్తుంటారు.

ప్రస్తుతం వర్షాలు లేక కరువులో కూలీలు

ఎన్నో సంవత్సరాలుగా ఎండుగడ్డి వ్యాపారం చేస్తూ ఆనందంగా జీవించారు. కానీ మూడేళ్లుగా వర్షాలు సరిగ్గా పడకపోవడంతో లారీలను ఇంటి దగ్గరే పెట్టుకుంటున్నారు. కూలీలు కూడా సరిగ్గా దొరక్క ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలను కొనేందుకు చేసిన అప్పులు అలాగే ఉన్నాయని వాపోతున్నారు.

అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ఎండుగడ్డి వ్యాపారస్థులకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.

Intro:TG_SRD_42_23_GADDI_LORY_VIS_PKG_C1

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్.9000302217
Last Updated : Apr 23, 2019, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.