ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. 2018 ఫిబ్రవరిలో జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) లో ఎంపికైన వారికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. కమిటీ చైర్మన్ గా జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరుగనుంది. 2010 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు. అదే ఏడాది జులైలో ఫలితాలు విడుదల చేశారు. అక్టోబర్, నవంబర్ నెలలో 1:3 లెక్కన ధ్రువపత్రాలు పరిశీలించారు. గత విద్యా సంవత్సరమే వీరిని నియమిస్తారని ఆశించినా.. విద్యా వాలంటీర్లను నియమించి సరిపెట్టారు. ఈ ఏడాదీ వాలంటీర్లను రెన్యూవల్ చేయడంతో టీఆర్‌టీ అభ్యర్థులంతా ఆందోళన చెందారు. ఎట్టకేలకు ప్రభుత్వం నియామకాలకు సంబంధించి కసరత్తు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. మెుత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1250 మంది నూతన ఉపాధ్యాయులు నియామకం కానున్నారు. విభాల వారిగా పోస్టులు ఎస్జీటీ 876 ఎస్‌ఏలు, 214 ఎల్‌పీలు, 125 పీఈటీలు, 33 ఎస్‌ఏ,(పీడీ)- 2.
ఇదీ చూడండి. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 29 మంది దుర్మరణం