ETV Bharat / state

మాయమాటలు చెప్పి.. మహిళ మెడలో గొలుసు చోరీ! - మెదక్​ జిల్లా వార్తలు

పట్టపగలేే.. మాటల్లో పెట్టి ఓ మహిళ మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన మెదక్​ జిల్లా శివ్వంపేటలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Gold Chain Thefted In Medak District Shivvampet
మాయమాటలు చెప్పి.. మహిళ మెడలో గొలుసు చోరీ!
author img

By

Published : Sep 19, 2020, 9:02 PM IST

మెదక్​ జిల్లా శివ్వంపేటకు చెందిన బిచ్కుంద క్రిష్ణవేణి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతోంది. శుక్రవారం నాడు సాయంత్రం ఐదుగంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి క్రిష్ణవేణి దగ్గరకు వచ్చి.. మీకు లాటరీలో బైక్​ వచ్చిందని చెప్పాడు. పేదవారి ఫోన్​ నెంబర్​ మీద లాటరీ తీస్తారని.. మీకు అదృష్టం ఉండటం వల్ల లాటరీలో మీ పేరు వచ్చిందని నమ్మబలికాడు. రోడ్డుపై ఆగి ఉన్న వాహనాల లారీని చూపించి.. మీ ఇల్లు చూపిస్తే.. ఇంటి దగ్గర బైక్​ దింపేసి వెళ్లిపోతామని చెప్పాడు. అనుమానం వచ్చిన క్రిష్ణవేణి భర్త అంజయ్యకు ఫోన్​ చేసింది. అలాంటి మాటలు నమ్మవద్దని.. తాను వచ్చే వరకు ఆగమని ఆంజయ్య క్రిష్ణవేణికి సూచించాడు.

క్రిష్ణవేణిని మాటల్లో పెట్టి.. ఆగంతకుడు ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు. మెడలు ఉన్న బంగారు గొలుసు ఇంట్లో పెట్టి రావాలని.. అధికారులు చూస్తే.. ఆర్థికంగా ఉన్నవారే అనుకొని.. బైక్​ ఇవ్వరని చెప్పాడు. నిజమే అని నమ్మిన క్రిష్ణవేణి మెడలోని బంగారు గొలుసు తీసి.. ఇంట్లో పెట్టి వచ్చింది. ఆగంతకుడు మళ్లీ ఆమెను కూరగాయల దుకాణం వద్ద దింపాడు. మళ్లీ క్రిష్ణవేణి ఇంటికి వెళ్లి ఆమె కోడలు నవీనను మీ అత్తమ్మ బంగారు గొలుసు ఇవ్వమంటున్నదని చెప్పాడు. ఎందుకు అని నవీన ప్రశ్నించగా.. తొందరగా ఇవ్వు.. అని ఆమెను కంగారు పెట్టాడు. నిజంగానే క్రిష్ణవేణి గొలుసు ఇవ్వమన్నదేమో అని నవీన బంగారు గొలుసు ఇచ్చేసింది. గొలుసు చేతిలో పడగానే దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన క్రిష్ణవేణికి నవీన జరిగిన విషయం చెప్పింది. తాను ఎవరినీ పంపలేదని.. మోసాపోయానని గ్రహించి లబోదిబోమంటూ రోదించింది. అనంతరం శివ్వంపేట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి: సమీకృత కలెక్టరేట్​ను సందర్శించిన జిల్లా పాలనాధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.