మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదని ఆందోళనకు దిగారు. తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం లేదని రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్లే రోడ్డుపై అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. అన్నదాతల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
తమ ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు రైస్ మిల్లులకు తరలించే వరకు తమ రాస్తారోకో కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల గత రాత్రి కురిసిన వర్షానికి తమ ధాన్యం తడసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రంలో వర్షార్పణం అయిందని వాపోయారు. నిజాంపేట తహసీల్దార్ జయరాములు, ఎస్సై ప్రకాష్ గౌడ్ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపచేశారు.
ఇదీ చదవండి: Baby Murder: మూడేళ్ల బిడ్డను చంపి అంత్యక్రియలు..