ETV Bharat / state

భూ పట్టాల కోసం తిరిగి.. మా ప్రాణాలు అవిసిపోతున్నాయి - formers

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా.. సామాన్యుల సమస్యలు మాత్రం ఆదిలోనే ఉన్నాయి.  జిల్లాలో భూ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన ఆ ఫలితాలు మాత్రం క్షేత్ర స్థాయికి వెళ్ళడం లేదు. అధికారులకు లంచాలిచ్చినా పనులు కావడం లేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు.

భూ పట్టాల కోసం తిరిగి.. మా ప్రాణాలు అవిసిపోతున్నాయి
author img

By

Published : Sep 25, 2019, 5:46 PM IST

భూ సమస్యల పరిష్కారంలో కిందిస్థాయి అధికారులు విఫలమయ్యారు అనడానికి మెదక్ జిల్లా నత్నయపల్లి గ్రామానికి చెందిన 20 మంది రైతులే నిదర్శనం. జిల్లాల వికేంద్రీకరణ అనంతరం వేరే జిల్లా పరిధిలోకి వెళ్లిన తమ భూముల మార్పిడి కోసం ఆర్డీవో కార్యలయం చూట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. భూమలకు సంబంధించి పట్టా మార్పిడి, తప్పులు సరి చేయడం, రికార్డులు ఎక్కించడం పలు సమస్యల పరిష్కారానికై అధికారులు డబ్బులు వసూలు చేసినట్లు బాధిత రైతులు పేర్కొంటున్నారు. అయినా పని చేయడం లేదని వాపోతున్నారు.

ఈనాడు కథనంపై స్పందించి

పట్టా భూములను ఆన్​లైన్ చేసి.. కొత్త పాసు పుస్తకాలు అందించేందుకు వీఆర్వో నర్సింహులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు బాధిత రైతులు ఆర్డీవో వద్ద మొరపెట్టుకున్నారు. ఎట్టకేలకు ఈనాడు లో వచ్చిన కథనానికి స్పందించి.. సెలవు రోజైన ఆదివారం నాడే సగం సమస్యలను పరిష్కరించారని.. అనంతరం వీఆర్వోపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారని రైతులు తెలిపారు.

సమస్యలను మా దృష్టికి తీసుకురండి

మెదక్ జిల్లా నత్నయపల్లి గ్రామానికి చెందిన రైతుల సమస్య.. ఈనాడు పత్రికలో ప్రచురితం కావడం వల్ల తమ దృష్టికి వచ్చిందని.. ఆపై వెంటనే సమస్య పరిష్కారించాలని సంబంధిత ఎమ్మార్వోకి సూచించినట్లు సంగారెడ్డి ఆర్డీవో శీను తెలిపారు. బాధితుల నుంచి వాంగ్మూలం నమోదు చేశామని.. దానిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా డివిజన్ పరిధిలో 90శాతానికి పైగా సమస్యలు పరిష్కరించామని.. మిగిలిన వాటిని రానున్న 10- 15 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని కోరారు. నత్నయపల్లి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ సమస్యలపై ఈటీవీ- ఈనాడు కథనానికి స్పందించిన ఆర్డీవో మూడు రోజుల తర్వాత వీఆర్వో నర్సింహులుపై సస్పెన్షన్ వేటు వేశారు.

భూ పట్టాల కోసం తిరిగి.. మా ప్రాణాలు అవిసిపోతున్నాయి

ఇదీ చూడండి: అసలు ఆ స్థలం ఎవరిదో తెలిసేదెలా?

Intro:TG_SRD_56_20_REVENUE_ISSUES_PKG_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
NOTE: ఈటీవీ తెలంగాణ- ఈనాడు పరిశీలన కథనం. గమనించగలరు

( ) రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా.. సామాన్యుల సమస్యలు మాత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. జిల్లాలో భూ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన ఆ ఫలితాలు మాత్రం క్షేత్ర స్థాయికి వెళ్ళడం లేదు. దాంతో రైతులు ఏళ్లతరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.....LOOK

VO1: భూ సమస్యల పరిష్కారం లో కింది స్థాయి అధికారులు విఫలమయ్యారని అనడానికి మెదక్ జిల్లా నత్నయపల్లి గ్రామానికి చెందిన 20 మంది రైతులే ఇందుకు నిదర్శనం. వీరంతా బుధవారం సంగారెడ్డి ఆర్డీవో శీను దగ్గరకు వచ్చారు. తమ గ్రామానికి చెందిన భూములు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కోడిపాక, నాగారం గ్రామాల్లోని 33, 83,84,85,94,107 సర్వే నెంబర్లలలో ఉన్నాయని.. తమ భూములకు సంబంధించి పట్టా మార్పిడి, తప్పులు సరి చేయడం, రికార్డులు ఎక్కించడం వంటి వాటిపై మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నా వీఆర్వో నర్సింలు.. వెళ్లిన ప్రతి సారి "చేస్తాం- చేస్తామని" మాట దాటవేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులో ఎక్కించేందుకు డబ్బులు సైతం వసూలు చేసినట్లు బాధిత రైతులు పేర్కొంటున్నారు.....SPOT

Body:VO2: మా పట్టా భూములను ఆన్ లైన్ చేసి.. కొత్త పాసు పుస్తకాలు అందించేందుకు వీఆర్వో నర్సింలు తమ తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు బాధిత రైతులు ఆర్డీవో శీను వద్ద మొరపెట్టుకున్నారు. తమ భూములు పక్కా పట్టా భూములైన.. వీఆర్వో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా తన తండ్రి 2016లో చనిపోయితే.. దానికి సంబంధించిన భూమిని ఇప్పటికి పౌతీ చేయలేదని.. దానికోసం తమ వద్ద 20వేలు డబ్బులు వసూలు చేసినట్లు స్పష్టం చేశారు. ఎట్టకేలకు ఈనాడు లో వచ్చిన కథనానికి స్పందించి.. సెలవు రోజైన ఆదివారం నాడే సగం సమస్యలను పరిష్కరించాడని.. ఆపై తనపై ఇచ్చిన ఫిర్యాదు ను వెనక్కి తీసుకోవాలని వారిని విజ్ఞప్తి చేశాడు..... BYTE
బైట్: సుదర్శన్, బాధిత రైతు
బైట్: సతీష్, బాధిత రైతు
బైట్: వెంకటేశ్, బాధిత రైతు
బైట్: దుర్గయ్య, బాధిత రైతు

VO3: మెదక్ జిల్లా నత్నయపల్లి గ్రామానికి చెందిన రైతుల సమస్య.. ఈనాడు పత్రికలో ప్రచురితం కావడం వల్ల తమ దృష్టికి వచ్చిందని.. ఆపై వెంటనే సమస్య పరిష్కారించాలని సంబంధిత ఎమ్మార్వో కి సూచించినట్లు సంగారెడ్డి ఆర్డీవో శీను తెలిపారు. తమ తండ్రి చనిపోయి మూడు సంవత్సరాలు అయినా.. వీఆర్వో పౌతీ చేయకుండా నిర్లక్ష్యం గా వ్యవహరించడం.. ఆపై రైతుల నుంచి 20వేలు తీసుకున్నట్లు వారు పిర్యాదు చేశారన్నారు. దీనిపై బాధితుల నుంచి వాంగ్మూలం నమోదు చేశామని.. దానిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా డివిజన్ పరిధిలో 90శాతానికి పైగా సమస్యలు పరిష్కరించామని.. మిగిలిన వాటిని రానున్న10- 15 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.......BYTE
బైట్: శీను, సంగారెడ్డి ఆర్డీవో

Conclusion:VO: భూ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుందని.. దాని కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఆర్డీవో తెలిపారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని కోరారు.

NOTE: నత్నయపల్లి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ సమస్యలపై ఈటీవీ- ఈనాడు కథనానికి స్పందించిన ఆర్డీవో మూడు రోజుల తర్వాత వీఆర్వో నర్సింలుని సస్పెన్షన్ వేటు వేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.