ETV Bharat / state

సైకిల్​తో కలుపుతీత పరికరాన్ని తయారు చేసిన రైతు

మెదక్​ జిల్లా నాయిని జలాల్​పూర్​ గ్రామంలో ఓ రైతు  వినూత్నంగా ఆలోచించాడు. సైకిల్​ పరికరాలతో కలుపుతీత పరికరాన్ని తయారు చేసి పత్తి, మెుక్కజొన్న పంటల్లో కలుపు తీస్తున్నాడు.

సైకిల్​తో కలుపుతీత పరికరాన్ని తయారు చేసిన రైతు
author img

By

Published : Jul 10, 2019, 10:36 PM IST

జిల్లాలో కొద్దిపాటి వర్షానికి అక్కడక్కడా కొంతమంది రైతులు మొక్కజొన్న, పత్తి వేశారు. ఆ పంటల్లో కలుపు తీయడానికి కూలీలు రాక రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ గ్రామానికి చెందిన రైతు శంకర్ వినూత్నంగా ఆలోచించాడు. కూలీల సమస్యను అధిగమించేందుకు వినూత్నంగా ఈ అన్నదాత సైకిల్ పరికరాలతో చిన్నపాటి మార్పులు చేసి కలుపుతీత పరికరం తయారుచేశాడు. కౌలుకు తీసుకున్న నాలుగు ఎకరాల పొలంలో పత్తి, మొక్కజొన్న వేశాడు. కలుపు తీయడానికి ప్రస్తుతం దీనిని ఉపయోగిస్తున్నాడు.

వెయ్యి ఖర్చుతో తయారీ...

కలుపు తీయడం సులభంగా ఉందని రైతు శంకర్ తెలిపాడు. ఒక రోజులో ఎకరం పొలంలో కలుపు తీయవచ్చంటున్నాడు. వాస్తవంగా ఈ పరికరం ద్వారా కాకుండా సాధారణంగా కూలీల ద్వారా కలుపు తీస్తే రెండు వేల నుంచి మూడు వేల వరకు ఖర్చయ్యేదని ఆయన తెలిపారు. దీన్ని తయారు చేయడానికి 1000 రూపాయలు ఖర్చు అయిందని వెల్లడించారు.

సైకిల్​తో కలుపుతీత పరికరాన్ని తయారు చేసిన రైతు

ఇవీ చూడండి: ఈనెల 14న ఓటర్ల తుది జాబితా

Intro:JK_TG_SRD_42_10_CYCLE_VIS_AVB_TS10115..
యాంకర్ వాయిస్... జిల్లాలో కొద్దిపాటి వర్షానికి అక్కడక్కడా కొంతమంది రైతులు మొక్కజొన్న పత్తి వేశారు ఆ పంటలలో కలుపు తీయడానికి కూలీలు రాక రైతులు చాలా అవస్థలు పడుతున్నారు దీనితో మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ గ్రామానికి చెందిన రైతు శంకర్ వినూత్నంగా ఆలోచించి పాత సైకిల్ పరికరాలను తీసుకొని ఇనుప దంతే వెల్డింగ్ చేయించాడు కూలీల సమస్యను అధిగమించేందుకు వినూత్నంగా ఆలోచన చేసి ఈ యువ రైతు సైకిల్ పరికరాలతో చిన్నపాటి మార్పులు చేసి ,, సైకిల్ దంతెల,,. చేసుకుని ని కౌలుకు తీసుకున్న నాలుగు ఎకరాల పొలం లో పత్తి మొక్కజొన్న వేశాడు కలుపు తీయడానికి ప్రస్తుతం దీనిని ఉపయోగిస్తున్నాడు కలుపు తీయడం సులభంగా ఉందని రైతు శంకర్ తెలిపాడు.. ఒక రోజులో ఎకరం పొలంలో కలుపు తీయవచ్చు అని తెలిపాడు వాస్తవంగా ఈ పరికరం ద్వారా కాకుండా సాధారణంగా కూలీల ద్వారా కలుపు తీస్తే రెండు వేల నుంచి మూడు వేల వరకు ఖర్చు అయ్యేదని. లంబాడి మణి తెలిపారు దీన్ని తయారు చేయడానికి 1000 రూపాయలు ఖర్చు అయిందని తెలిపారు...
బైట్...శంకర్.రైతు.
మణి.. మహిళ.రైతు.

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

TAGGED:

CYCLEfarmer
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.