మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవి భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటు చాలా విలువైనదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. అభివృద్ధిని కాంక్షించే నాయకుడికి ఓటు వేస్తే.. అది మన ఐదేళ్ల అభివృద్ధికి పునాది అవుతుందన్నారు.
నాయకుడిని యువతే నిర్ణయిస్తారని.. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేసి సమర్థ పాలనకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో ఓటు ప్రతిజ్ఞ చేయించారు.
ఇవీ చూడండి: 20 రోజుల్లో రూ.1,500 కోట్ల మద్యం తాగేశారు!