మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లోని నిరుపేదలకు స్థానిక వర్తక వ్యాపారులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సుమారు 250 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులను అందించారు.
ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్, నిజాంపేట్ ఎస్సై ప్రకాశ్‌గౌడ్ పాల్గొన్నారు. నిరుపేదలకు సహాయం చేయాలనుకునేవారు తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు. కరోనాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.