మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సుమారు 500 మంది ఆటో డ్రైవర్లకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు నిత్యావసరాలు అందజేశారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కరోనా వల్ల ఎవరూ ఆకలితో అలమటించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీ సూచించారు. పేదల ఆకలితీర్చేందుకు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: పెళ్లి కోసం 850కి.మీ సైక్లింగ్- ముహూర్తం టైమ్‌కు క్వారంటైన్