సింగూరు జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా ఆలయం(Edupayala Vana durga Temple) జలదిగ్బంధంలోనే ఉంది. ఆలయం పైకప్పును తాకుతూ మంజీర పరవళ్లు తొక్కుతోంది.
రాజగోపురంలో ఏర్పాటుచేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేపట్టి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఆలయం వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ఏడుపాయల ఔట్‌పోస్ట్ సిబ్బంది బందోబస్తు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: 'చై-సామ్ విడిపోవడానికి ఆ బాలీవుడ్ స్టారే కారణం'