కుటుంబ పెద్దదిక్కును కోల్పోయి.. ఆకలితో అలమటిస్తున్న రెండు కుటుంబాలకు దాతలు అండగా నిలిచారు. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన చాకలి నాగులు, వడ్ల చంద్రం కుటుంబాలకు.. స్వేరోస్ తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ.. ఐదు వేల రూపాయల నగదు, బియ్యం అందజేశారు.
రెండు కుటుంబాలలోని పిల్లలకు స్వేరోస్ ద్వారా.. ఉచిత విద్య అందిస్తామని, విద్య వల్లే పేదరికనిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల పేద కుటుంబాలపై పెనుభారం పడిందని.. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఇంటర్ మూల్యాంకనం చేసే అధ్యాపకుల ఆందోళన