ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఈసారి కొవిడ్ కారణంగా వారం రోజుల పాటు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై మెదక్ కలెక్టరేట్లో.. జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వచ్చే నెల 5 నుంచి 12వ తేదీ వరకు నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డీఎంహెచ్వో తెలిపారు. 19 ఏళ్లలోపు పిల్లలందరికీ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని తెలియజేశారు.
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 90 శాతం వరకు మాత్రల పంపిణీ పూర్తి చేశామన్నారు. మిగతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒకటి రెండు రోజుల్లో అందజేయడం జరుగుతుందన్నారు. మందుల గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇవీ చూడండి: అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశం