రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ సేవలు మెదక్ జిల్లాలో ప్రారంభమయ్యాయి. మెదక్ తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీఓ సాయిరాం లాంఛనంగా ధరణి పోర్టల్‌ని ప్రారంభించారు.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిర్వహించేందుకు జిల్లాలో 20 మండలాల్లోని తహసీల్దారు కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 2 వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. కంప్యూటర్, పాస్ బుక్, ప్రింటర్, స్కానర్, కెమెరా, బయోమెట్రిక్ యంత్రాన్ని అధికారులు సమకూర్చారు.
ధరణి ఆపరేటర్లకు ఇదివరకే శిక్షణ పూర్తి కాగా రైతులకు ఈరోజు నుంచి స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
ఇదీ చదవండి: 'ధరణి' లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు: కేసీఆర్