మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని కొత్తపేట గ్రామ సమీపంలో ఐదు సంవత్సరాల వయసున్న జింక కుక్కల దాడిలో మృతి చెందింది. జింకను చుట్టుముట్టిన కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. స్థానికుల సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
విచారణ చేసిన అనంతరం జింకను అక్కడే పోస్టుమార్టం చేసి పూడ్చి వేశారు. అటవీ ప్రాంతంలో తాగేందుకు నీళ్లు దొరకకనే వన్యప్రాణులు గ్రామాలకు వస్తున్నాయని.. అలా వచ్చిన క్రమంలోనే కుక్కల దాడిలో జింక చనిపోయిందని గ్రామస్థులు తెలిపారు.