ETV Bharat / state

నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి

మెదక్​ జిల్లా రామాయంపేటలోని పేదలకు.. ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రజలు కరోనాపట్ల అవగాహన కలిగి ఉండి స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆమె సూచించారు.

daily-essentials-distributed-by-mla-padmadevendar-reddy-in-medak
నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి
author img

By

Published : Apr 4, 2020, 5:29 PM IST

మెదక్ జిల్లా రామాయంపేట్ పట్టణంలో నిరుపేదలకు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ. 1000 విలువైన సరుకులను ఆమె అందజేశారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా లాక్​డౌన్ పాటించాలన్నారు.

అత్యవసర పరిస్థితిలోనే బయటకు వెళ్లాలని అలా వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వీయ, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని శానిటైజర్​ లేదా సబ్బుతో చేతులు కడుక్కోవాలని... మాస్కులు ధరించాలని పద్మాదేవేందర్​రెడ్డి సూచించారు.

నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి

ఇవీ చూడండి: సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.