మెదక్ జిల్లా నర్సాపూర్ మునిసిపాలిటీలోని 50 మంది కార్మికులకు కలెక్టర్ ధర్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్రెడ్డిలు కలిసి నిత్యావసరాలను, సేఫ్టీకిట్లను పంపిణీ చేశారు. విధులు నిర్వర్తించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ప్రజలు స్వీయనిర్బంధంలో ఉండాలని.. అదొక్కటే మనల్ని రక్షిస్తుందన్నారు. అనవసరంగా బయటతిరిగే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో లాక్డౌన్ పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో పురపాలిక ఛైర్పర్సన్ మురళీయాదవ్ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్