కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. అంబెేడ్కర్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసనలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు నియంత్రించాలని భారత్ బంద్‌లో భాగంగా ధర్నా చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ప్రొబేషన్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం శుభవార్త