మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. గురువారం నిర్వహించిన పరీక్షల్లో ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వారిలో 10 నెలల శిశువుతో పాటు... ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకింది.
కౌడిపల్లి మండలంలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని వైద్యులు సూచించారు. వాతావరణం చల్లగా ఉండడం వల్ల కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.